ఏపీ సీఎం జగన్ తో విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మోసగాడని అందరికీ తెలుసన్న కేశినేని నాని ఇంత పచ్చి మోసగాడని మాత్రం తనకు ఇప్పుడే తెలిసిందని తెలిపారు.చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఉపయోగం లేని వ్యక్తి అని చెప్పారు.
జగన్ నిరుపేదల పక్షపాతి అని పేర్కొన్నారు.అందుకే జగన్ తో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
ఎంపీగా రాజీనామా ఆమోదం తరువాత వైసీపీలో చేరతానని స్పష్టం చేశారు.







