గుంటూరు కారం మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్.. అన్ని రూ.కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అంటూ?

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడం సర్వ సాధారణం అయిపోయింది.గుంటూరు కారం( Guntur Karam ) సినిమాకు మహేష్ బాబు( Mahesh Babu ) సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ జరిగింది.

 Mahesh Babu Guntur Karam Movie Record Business Details,guntur Karam,guntur Karam-TeluguStop.com

గుంటూరు కారం థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే నైజాం ఏరియాలో ఈ సినిమా హక్కులు 42 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.సీడెడ్ ఏరియాలో ఈ మూవీ హక్కులు 13.75 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.

Telugu Trivikram, Guntur Karam, Mahesh Babu, Maheshbabu, Nizam, Sreeleela-Movie

ఏపీలో టికెట్ రేట్ల పెంపు గురించి క్లారిటీ రావాల్సి ఉంది.గుంటూరు కారం మూవీ ఆంధ్ర హక్కులు 47.25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు 103 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు సమాచారం అందుతోంది.ఓవర్సీస్ హక్కులు( Overseas Rights ) 20 కోట్ల రూపాయలకు అమ్ముడవగా కర్ణాటక, ఇతర ఏరియాల హక్కులు 9 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Telugu Trivikram, Guntur Karam, Mahesh Babu, Maheshbabu, Nizam, Sreeleela-Movie

గుంటూరు కారం సినిమా నిర్మాతలకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలు వచ్చాయని తెలుస్తోంది.గుంటూరు కారం సినిమాకు రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.గతేడాది మహేష్ బాబు నటించిన సినిమాలేవీ థియేటర్లలో విడుదల కాలేదు.మహేష్ బాబు సినీకెరీర్ లో ఈ సినిమాకు హైయెస్ట్ బిజినెస్( Highest Business ) జరగడం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.

Telugu Trivikram, Guntur Karam, Mahesh Babu, Maheshbabu, Nizam, Sreeleela-Movie

గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్( Trivikram ) సినీ కెరీర్ కు కీలకం కానుంది.ఇకపై త్రివిక్రమ్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది.త్రివిక్రమ్ తర్వాత మూవీ బన్నీ హీరోగా తెరకెక్కనుందని భోగట్టా.గుంటూరు కారం ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి.గుంటూరు కారం మూవీ డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం కావడం గమనార్హం.ఓటీటీలో ఈ సినిమా ఆలస్యంగానే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube