అయోధ్య రామ మందిరంలో మరికొన్ని రోజుల్లో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరగనుండగా రాముని భక్తులు ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయోధ్య రామ మందిరాన్ని( Ayodhya Ram Mandir ) దర్శించుకోవాలనే భక్తులకు సైతం కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.
ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12 : 30 గంటలకు రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది.రాముని ప్రాణ ప్రతిష్ట రోజున ఎలాంటి గాడ్జెట్ లను ఆలయంలోకి అనుమతించరని తెలుస్తోంది.
అయితే రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంలో 30 సంవత్సరాలుగా మౌన వ్రతం( Mouna Vratham ) పాటిస్తున్న కలియుగ శబరి సరస్వతీ దేవి( Kaliyuga Sabari Saraswati Devi ) గురించి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.జార్ఖండ్ కు( Jharkhand ) చెందిన సరస్వతీ దేవి శ్రీరాముని భక్తురాలు కాగా అయోధ్యలో ఆలయ నిర్మాణం వరకు మౌన వ్రతం పాటించాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు.1992 సంవత్సరంలో సరస్వతీ దేవి ప్రతిజ్ఞ చేశారు.
ప్రతిరోజూ 23 గంటల పాటు ఆమె మౌన వ్రతం పాటించారు.ప్రధాని మోదీ( PM Modi ) ఆలయానికి శంఖుస్థాపన చేసిన రోజు నుంచి ఆమె రోజుకు 24 గంటల పాటు మౌనవ్రతం పాటిస్తూ వస్తున్నారు.రాముడంటే ఆమెకు ఉన్న భక్తి గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
రామ మందిరం శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను టీవీలో చూసిన తర్వాత ఆమె మౌన వ్రతం వీడనున్నారని సమాచారం అందుతోంది.
అయోధ్య రామ మందిరానికి ఆమెకు ఆహ్వానం అందిందని సమాచారం అందుతోంది.అయోధ్య రామ మందిరానికి మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేసారని తెలుస్తోంది.అయోధ్య గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని ప్రధాని తీసుకురానున్నారని సమాచారం అందుతోంది.
శ్రీ రాముడికే జీవితాన్ని అంకితం చేసిన సరస్వతీ దేవి( Saraswati Devi ) భక్తిని ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పవచ్చు.అయోధ్య రామ మందిరానికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.