సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటించిన గుంటూరు కారం( Gunturu kaaram ) సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ఎమోషనల్ గా అందరిని ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతుందని తెలిసి నాకే ఆశ్చర్యంగా ఉంది.ఇన్నేళ్లు ఇంత దూరం ఎలా ప్రయాణించాన అనే ఆశ్చర్యం తనకు కలుగుతుందని తెలిపారు.అయితే నేను ఇక్కడ ఈరోజు ఉన్నాను అంటే అందుకు కారణం మీరే అంటూ ఈయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
ఇక ఈ వేడుకలో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ ( Krishna ) గారిని కూడా గుర్తు చేసుకున్నారు.

నా సినిమాలన్నీ సంక్రాంతికి వచ్చినవి ఎంతో మంచి విజయం అందుకున్నాయి .ప్రతి సంక్రాంతికి ఇలా సినిమాలు విడుదలయితే నాన్న ఫోన్ చేసి మరి నాకు అభినందనలు తెలియజేసే వారు కానీ ఈసారి మాత్రం నాన్న లేరంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.ఇకపై మీరే నాకు అమ్మానాన్నలు అంటూ అభిమానులను ఉద్దేశించి ఈయన రెండు చేతులు జోడించి దండం పెట్టారు.
ఇలా మహేష్ బాబు దండం పెట్టడంతో అభిమానులు కూడా ఆయనకు దండం పెట్టారు.ఇక మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి నాకన్నీ మీరే అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించిన తర్వాత మహేష్ బాబు నటించిన మొదటి సినిమా గుంటూరు కారం.ఈ సినిమా విడుదలకు తన తండ్రి లేకపోవడంతో మహేష్ బాబు తన తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.







