సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు తమ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి తరుణంలో పెళ్లి గురించి ఆలోచన చేయడం లేదు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు నాలుగు పదుల వయసులోకి అడుగుపెడుతున్న ఇంకా పెళ్లి( Marriage ) గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదు.ఈ క్రమంలోనే ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ కూడా పెళ్లి చేసుకోకుండా ఇప్పటికే సింగిల్గానే ఉన్నారని చెప్పాలి అలాంటి వారిలో నటి లక్ష్మి గోపాల స్వామి( Lakshmi Gopalaswamy ) ఒకరు.

ఇవే నటిగా కంటే భరతనాట్య కళాకారిణి( Bharatanatyam Artist ) అని పిలిపించుకోవడం తనకు చాలా ఇష్టమని తెలిపారు భరతనాట్య కళాకారునిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఎన్నో సినిమాలలో నటించారు.ఇటీవల తెలుగులో ఈమె సైరా నరసింహారెడ్డి అరవింద సమేత వంటి సినిమాలలో కూడా నటించారు.ఇలా వెండితెరపై నటిస్తూనే మరోవైపు బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తూ సందడి చేస్తున్నటువంటి లక్ష్మి జనవరి ఏడో తేదీ తన 57వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈమె 57 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉన్నారు.ఇలా ఈమె పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు.బహుశా సినిమాలలో పడి ఈమె పెళ్లి చేసుకోవడం మర్చిపోయారా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.అయితే ఈమె ఇప్పటికే సింగిల్ గా( Single ) ఉండడం గురించి మాట్లాడుతూ నన్ను ఒక నటిగా, భరతనాట్య కళాకారిణిగా సమాజంలో నాకు ఉన్నటువంటి గౌరవం చూసి నన్ను పెళ్లి చేసుకునే వాడు నాకు అవసరం లేదని ఇవేవీ లేకపోయినా

నన్ను గౌరవంగా చూసుకునే వ్యక్తి రావాలని అది కూడా నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించాను కానీ అలాంటి వ్యక్తి ఇప్పటివరకు దొరకలేదు అందుకే నేను కూడా సింగిల్ గానే ఉన్నాను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఆరు పదుల వయసుకు దగ్గరవుతున్నటువంటి ఈమె పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో కూడా లేదని తెలుస్తుంది.







