మహేష్ బాబుకి ఒక కన్ను కనిపించదా... ఇదేం ట్విస్ట్ గురూజీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్వరలోనే గుంటూరు కారం(Gunturu Kaaram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు .ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

 Interesting News Viral About Mahesh Babu Role In Gunturu Kaaram Details, Mahesh-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.ఇటీవల కాలంలో దర్శకులు హీరోలకు చిన్నచిన్న లోపాలు పెడుతూ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ట్రెండ్ అవుతుంది.

రంగస్థలం( Rangasthalam ) సినిమాలో రామ్ చరణ్ కు చెవుడు, ఎన్టీఆర్( NTR ) ఒక సినిమాలో నత్తి పాత్రలో నటించారు.అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాలో గూని ఉన్నటువంటి పాత్రలో నటించారు.

Telugu Gunturu Kaaram, Mahesh Babu, Maheshbabu, Pushpa, Ram Charan, Rangasthalam

ఇలా ఈ సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ అయిన విషయం మనకు తెలుసు.అయితే మహేష్ బాబు( Mahesh Babu ) విషయంలో ఇలాంటి డి గ్లామర్ పాత్రలు ప్రేక్షకులు ఇష్టపడరనే విషయం తెలిసిందే.అందుకే ఈయన పుష్ప సినిమా ( Pushpa ) అవకాశం ముందుగా తనకు వచ్చిన తనని ప్రేక్షకులు అలా యాక్సెప్ట్ చేయలేదని రిజెక్ట్ చేశారు.అయితే తాజాగా గుంటూరు కారం సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో మహేష్ బాబు ఒక చిన్న లోపంతో బాధపడే వ్యక్తి పాత్రలో నటించబోతున్నారంటూ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఈ విషయం గురించి అధికారిక ప్రకటన లేదు.

Telugu Gunturu Kaaram, Mahesh Babu, Maheshbabu, Pushpa, Ram Charan, Rangasthalam

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ అలాగే ట్రైలర్ కనుక గమనిస్తే ఇందులో మహేష్ బాబుకి ఒక కన్ను సరిగా కనిపించదు అంటూ పలువురు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.మోనాక్యులర్ విజన్ తో బాధపడే వాడిగా మహేష్ క్యారెక్టర్ రూపొందించారని అంటున్నారు.మరి సోషల్ మీడియాలో మహేష్ బాబు క్యారెక్టర్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube