ఐపీఎల్ 2024 కు దూరంగా సూర్య కుమార్ యాదవ్..కారణం ఏమిటంటే..?

భారత జట్టు స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) ఈ ఏడాది జరిగే ఐపీఎల్ 2024 కు( IPL 2024 ) దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలి అవకాశం కనిపిస్తోంది.

 Surya Kumar Yadav To Miss Initial Phase Of Ipl Due To Sports Hernia Details, Sur-TeluguStop.com

సూర్య కుమార్ యాదవ్ ఇప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.కానీ సూర్య కుమార్ యాదవ్ కు మరో ఆరోగ్య సమస్య బాధ పెడుతోంది.

స్పోర్ట్స్ హెర్నియా( Sports Hernia ) అనే ఆరోగ్య సమస్య సూర్యను ఇబ్బంది పెడుతోంది.సర్జరీ కోసం సూర్య జర్మనీ వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఇక సర్జరీ అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి ఐపిఎల్ 2024 దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ లో చికిత్స పొందుతున్న సూర్య కుమార్ యాదవ్ రెండు లేదా మూడు రోజుల్లో సర్జరీ ( Surgery ) కోసం జర్మనీకి వెళ్ళనన్నాడు.రంజీ ట్రోఫీతో సహా ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్లకు సూర్య దూరం అవ్వనున్నాడని బీసీసీఐ కు చెందిన ఒక అధికారి జాతీయ మీడియాకు తెలిపారు.టీ20 ప్రపంచ కప్ జూన్ లో జరుగనుంది.దీనిని దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ( BCCI ) ఐపీఎల్ 2024లో సూర్యను ఆడించే సాహసం చేయకపోవచ్చు.

ఒకవేళ ఇలా జరిగితే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు( Mumbai Indians ) గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది.ఇప్పటికే హార్థిక్ పాండ్యా గాయంతో క్రికెట్ కు దూరంగా ఉన్నాడు.హార్థిక్ పాండ్యా( Hardik Pandya ) ఎన్ని రోజులకు కోలుకుంటాడో.

ఎప్పుడు జట్టులో చేరుతాడో అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.ఇలాంటి సమయంలో ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగే ముంబై ఇండియన్స్ ఎంతవరకు రాణిస్తుందో చూడాల్సి ఉంది.

ఇక ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంటాడా లేదా అనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube