ఏ హీరో అయినా మాస్ హీరోగా ఎదగాలి అంటే యాక్షన్ సినిమాలు తీయాల్సిందే.అలాంటి సినిమాలు తీయాలంటే ఒక జనరేషన్ వెనక్కి వెళితే అందరూ చూపులు డైరెక్టర్ దాస్( Director Das ) పైనే ఉండేది.
ఆయన సినిమాల్లో హీరోలు చాలా సాహసాలు చేసినట్టే ఆయన జీవితం కూడా ఎన్నో సాహసాలతో కలిసి ఉంటుంది.బుకింగ్ క్లర్క్ గా తన జీవితాన్ని ఆరంభించిన దాస్ ఎన్టీఆర్ బండ రాముడు సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఆ సెట్ ఫ్లోర్ ఆ తర్వాత ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి యుగంధర్( Yugandhar Movie ) అనే సినిమాకి దర్శకత్వం వహించాడు తనకు పట్టుదల ఎక్కువ అనుకున్నది ఎలాగైనా సాధిస్తాడు అందుకే ఆయనతోపాటు ఎంతో మందిని కొత్తవారిని ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు దాసరిని తన సినిమాకి మొదట రైటర్ గా పెట్టుకొని ఆ తర్వాత దర్శకుడు అయ్యేలా ఎంకరేజ్ చేయడంలో దాస్ ప్రముఖ పాత్ర వహించాడు.

దాస్ కి మరొక పేరు డిష్యుం డిష్యుం దాస్.ఎందుకంటే సౌత్ ఇండియాలోని మొట్టమొదటి కౌబాయ్ సినిమా కృష్ణతో( Super Star Krishna ) తీసింది ఈ దర్శకుడే.మేకప్ మెయిన్ గా పని చేస్తున్న వీర్రాజుని దాస్ నిర్మాతగా మార్చి తను కూడా విజయాన్ని అందుకున్నాడు.ఆయన తీసిన రౌడీ రాణి సినిమా బాలీవుడ్లో డాకురానిగా రీమేక్ కూడా అయింది.

దాస్ కి కృష్ణతో ప్రత్యేక అనుబంధం ఉంది ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 40 కి పైగా సినిమాలు వచ్చాయి.మొట్టమొదటిగా కృష్ణతో దర్శకత్వం చేసిన సినిమా టక్కరి దొంగ.ఆ తర్వాత మోసగాళ్లకు మోసగాడు( Mosagallaku Mosagadu ) ఈ సినిమాతోనే కృష్ణ కౌబాయ్ గా హాలీవుడ్ లో సినిమాలకు దీటుగా తెలుగులో నిలబడ్డాడు.

దాస్ తన కెరియర్ మొత్తంలో అక్కినేనితో తప్ప మిగతా అందరి హీరోలతో సినిమాలు తీశాడు.అల్లూరి సీతారామరాజు సినిమా( Alluri Sitaramaraju Movie ) టైంలో ఆ చిత్ర దర్శకుడు రామచంద్రారావు చనిపోగా యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా కృష్ణ కోసం డైరెక్ట్ చేశాడు.దాస్ కెరియర్ లో అనేక జేమ్స్ బాండ్ సినిమాలు తీయడం విశేషం రహస్య గూడాచారి, ఏజెంట్ గోపి అందులో చాలా బాగా ఆడిన చిత్రాలు.
సైకిల్ పై హార్మోని పెట్ట పట్టుకుని తిరిగే సత్యం అనే వ్యక్తిని సంగీత దర్శకుడిగా మార్చిన ఘనత కూడా దాస్ కి దక్కింది ఎంతోమంది యాక్షన్ దర్శకులకు కులగురువుగా మన డిష్యుం డిశుం చరిత్రలో మిగిలిపోయాడు.







