వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
తాను పార్టీ మారడం లేదన్న వేమిరెడ్డి కొందరు కావాలనే పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తాను వైసీపీలోనే కొనసాగుతానన్న ఆయన అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు.
ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







