టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు.ఈ మేరకు తిరువూరు మరియు ఆచంటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలకు ఆయన హాజరుకానున్నారు.
‘రా కదిలిరా’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా సభలకు పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.దాదాపు 60 ఎకరాల్లో తిరువూరు సభకు ఏర్పాట్లు చేయగా .టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.అలాగే తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఖమ్మం నుంచి కూడా పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే భారీ వాహన ర్యాలీలతో నేతలు సభాస్థలికి తరలివస్తున్నారు.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా చంద్రబాబు సభలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.







