సూపర్ స్టార్ మహేష్ కు జోడీగా ఇండోనేషియా బ్యూటీ.. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ను మించిన అందగత్తె అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు( Mahesh Babu ) నటించిన గుంటూరు కారం మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.మరికొన్ని గంటల్లో ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కానుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

 Mahesh Rajamouli Combo Movie Heroine Details Here Goes Viral In Social Media,raj-TeluguStop.com

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్( Guntur Kaaram Pre release event ) ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.గుంటూరు కారంతో మహేష్ మరో సక్సెస్ అందుకుంటాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మరోవైపు మహేష్ బాబు త్వరలో రాజమౌళి( Rajamouli ) మూవీ షూటింగ్ తో బిజీ కానుండగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరికేసింది.ఈ బ్యూటీ ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ను మించిన అందగత్తె అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

బ్యూటీ పేరు చెల్సియా ఇస్లాన్( Chelsea Islan ) కాగా మహేష్ చెల్సియా జోడీ బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Chelsea Islan, Hollywood, Mahesh, Rajamouli-Movie

1500 కోట్ల రూపాయల ఖర్చుతో హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని 2026లో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రాజమౌళి మహేశ్ సినిమా విషయంలో ఆర్.

ఆర్.ఆర్( RRR ) ను ఫాలో అవుతున్నారని ఆర్.ఆర్.ఆర్.ప్యాట్రన్ ప్రకారం ఒకేచోట ఎక్కువ సంఖ్యలో సెట్లు వేసి షూట్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

Telugu Chelsea Islan, Hollywood, Mahesh, Rajamouli-Movie

విదేశీ లొకేషన్లకు సంబంధించిన సీన్లను గ్రీన్ మ్యాట్ లో షూట్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.రాజమౌళి ఐదేళ్ల సమయం కేటాయిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.జక్కన్నకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube