వయసు( Age ) అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని ఇప్పటికే చాలామంది వృద్ధులు నిరూపించారు.తాజాగా మరొక 80 ఏళ్ల బామ్మ ఆ విషయాన్ని రుజువు చేసింది.ఆమె ఆ వయసులో సముద్రంపై సర్ఫింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.80 ఏళ్ల వయసులో సాధారణంగా సరిగా నడవడమే కష్టం.అలాంటిది ఆమె సర్ఫింగ్ బోర్డ్( Surfing Board ) పై నిల్చోని అలలపై దూసుకెళ్లింది.ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వృద్ధురాలు సర్ఫింగ్‌కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోను తన మనవరాలు రికార్డు చేసింది.ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ @brisahennessy ఈ వీడియో క్లిప్ షేర్ చేసింది.

బ్రిసా హెన్నెస్సీ అనే కోస్టా రికన్ ఒలింపిక్ అథ్లెట్( Brisa Hennessy, Costa Rican Olympic athlete ) ఈ వృద్ధురాలికి మనవరాలు అవుతుంది.ఆమె ప్రోత్సాహంతోనే ఈ ముసలామెడ సముద్రంపై సర్ఫ్ చేయడానికి ధైర్యం చేసింది.సముద్రంపై ఎంజాయ్ చేయడానికి 80 ఏళ్ల వయసు వచ్చినా పర్లేదు, ఏ ఏజ్ లో అయినా ఎంజాయ్ చేయవచ్చు అన్నట్లు సదరు మనవరాలు వీడియోకు క్యాప్షన్ జోడించింది.ఆ వృద్ధురాలు తన మనవరాలి సహాయంతో సముద్రంపై ఎలా సర్ఫింగ్ చేస్తుందో వైరల్ వీడియో( Viral Video )లో మనం చూడవచ్చు.
ఆమె సర్ఫింగ్ బోర్డ్ పై నిల్చని బ్యాలెన్స్ చేసుకుంటూ థ్రిల్లింగ్ అనుభూతిని పొందింది.పక్కనే ఉన్న మనవరాలు బామ్మను పర్యవేక్షించింది.ఇలా సర్ఫింగ్ చేస్తూ వారు ఒక ప్రొఫెషనల్ సర్ఫర్‌ని కూడా కలుసుకుంటారు, అతని అడ్వైస్ కోసం కూడా అడుగుతారు.

లక్షల్లో వ్యూ సంపాదించిన ఈ వీడియో చూసి నెటిజన్లు( Netizens ) ఆశ్చర్యపోతున్నారు.60 ఏళ్ల వయసులో ఉన్న ఒక నెటిజెన్ కామెంట్ చేస్తూ తాను కూడా లైఫ్ లో ఇలాగే ఎంజాయ్ చేస్తానని చెప్పింది.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







