ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని మాజీ ఎంపీ మాగంటి బాబు కలిశారు.
బీజేపీ సమావేశం జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన మాగంటి బాబు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తో సమావేశం అయ్యారని తెలుస్తోంది.పురంధేశ్వరితో భేటీ అయిన మాగంటి బాబు కొద్దిసేపు మాట్లాడిన తరువాత వెళ్లిపోయారు.
అయితే మాగంటి బాబు రావడంపై బీజేపీ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ క్రమంలో టీడీపీ దూతగా ఆయన వచ్చి ఉంటారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు.







