తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో విభజన సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది.
ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సిఎస్ లను పిలిచి మాట్లాడుతామని.అమిత్ షా( Amit Shah ) హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఐపీఎస్ ల సంఖ్య పెంచాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఇదే సమయంలో కేంద్ర జల శక్తి మంత్రి షేకావత్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు.
ఈ భేటీలో రేవంత్ తో పాటు సీఎస్ శాంతికుమారి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ( Ranga Reddy )ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ ఇంకా సాంకేతిక అనుమతులు ఇవ్వాలని వినతి పత్రం అందించారు.అంతేకాదు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.ఢిల్లీ పర్యటనలో ఫైనాన్స్, హెల్త్, ఇరిగేషన్, పరిశ్రమలతో పాటు పలు అంశాలపై వివిధ కేంద్ర ప్రభుత్వాధికారులతో సీఎం రేవంత్ భేటీ కావడం జరిగింది.
గురువారం ఉదయం చేపట్టిన ఈ ఢిల్లీ పర్యటనలో తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ బిజీబిజీగా గడపడం జరిగింది.ఈ పర్యటనలో గురువారం ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చించడం జరిగింది.అనంతరం రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ యాత్ర గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
అనంతరం కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ వరుసగా భేటీ అయ్యారు.