సూర్యాపేట జిల్లా: సూర్యాపేట ప్రముఖ వైద్యులు,డాక్టర్ ఆదుర్తి రామయ్య సతీమణి విజయలక్ష్మి మరణం వారి కుటుంబానికి తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.గురువారం అనారోగ్యంతో మృతి చెందిన ఆదుర్తి విజయలక్ష్మి మృతదేహాన్ని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి పులమాలవేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో డాక్టర్ ఏ.పీ.విఠల్ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రజా వైద్యశాలను ప్రారంభించారని,ఆ వైద్యశాల ఎన్నో దశాబ్దాలు ఈ ప్రాంత ప్రజలకు వైద్య సహాయాన్ని నిస్వార్ధంగా అందించారన్నారు.విఠల్ అనంతరం వారి సహోదరుడైన డాక్టర్ రామయ్య ప్రజా వైద్య సేవలను కొనసాగిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు.
వారి కుటుంబానికి సిపిఎం పార్టీకి ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు.అనేక సంవత్సరాలు పార్టీకి సానుభూతిపరుడుగా ఉంటూ అనేక సందర్భాలలో పార్టీకి డాక్టర్ రామయ్య కుటుంబం సహాయ, సహకారాలు అందించింది అన్నారు.
డాక్టర్ రామయ్య భార్య విజయలక్ష్మి మరణించడం దురదృష్టకరమని,వారి కుటుంబానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన ప్రగాఢ సంతాపం,సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,మట్టిపల్లి సైదులు,చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు జిల్లపల్లి నరసింహారావు, ఎల్గూరి గోవింద్, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మేకనబోయిన శేఖర్, నాయకులు చెరుకు సత్యం,మామిడి సుందరయ్య,డాక్టర్ సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.