సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో తల్లి పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ప్రగతి ( Pragathi ) ఒకరు.ఏదైనా ఒక సినిమాలో తల్లి పాత్రలలో నటించాలి అంటే అందరికీ టక్కున ఈమె గుర్తుకు వస్తుంది.
అంత అద్భుతంగా ఈమె తల్లి పాత్రలలో లీనమై నటిస్తారనే సంగతి మనకు తెలిసిందే.హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈమె హీరోయిన్గా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.

ఇక ఇటీవల కాలంలో ప్రగతి కాస్త సినిమాలను తగ్గించి ఎక్కువగా తన ఫోకస్ వర్కౌట్స్ పై( Workouts ) పెట్టింది అని చెప్పాలి.ఈమె నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ జిమ్ లో పెద్ద ఎత్తున వర్కౌట్లు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.ఇలా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ప్రగతి ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నటువంటి ఈమె తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఊర్వశివో రాక్షసివో అని సీరియ( Urvasivo Rakshasivo serial )ల్ లో కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా ఒక డైలాగుకు ఈమె లిప్ మూమెంట్ ఇచ్చారు.
నాకు ఎవడు అవసరం లేదు పుట్టేటప్పుడు తోడు ఉన్నారా పోయేటప్పుడు వస్తారా నేను సింగిల్గానే ఉంటాను.సింగిల్గానే పోతాను అనే డైలాగ్ కు లిప్ మూమెంట్ ఇచ్చారు.

ఈ విధంగా ఈ వీడియోని ఈమె షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.అయితే ఈమె పెళ్లి చేసుకొని పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు అయితే తన భర్తకు దూరంగా ఉన్నటువంటి ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ తన రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇలా తన పెళ్లి గురించి వార్తలు వస్తున్నటువంటి తరుణంలోనే ఈమె ఇలాంటి వీడియో షేర్ చేశారని పలువురు భావిస్తున్నారు.ఈ వీడియో పై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.







