అమలా పాల్, మంచు మనోజ్, కమల్ హాసన్, ప్రభుదేవా, ప్రకాష్ రాజ్, ధనుష్, పవన్ కళ్యాణ్, నిహారిక ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీలో పెళ్లిళ్లు అస్సలు కలిసి రాలేదు.
సుమంత్, నాగార్జున, నాగచైతన్య( Sumanth, Nagarjuna, Naga Chaitanya ) ముగ్గురు కూడా మ్యారేజ్ లలో ఫెయిల్ అయ్యారు.నాగార్జున లక్ష్మీ దగ్గుబాటి నుంచి, నాగచైతన్య సమంత నుంచి, సుమంత్ కీర్తి రెడ్డి నుంచి విడాకులు తీసుకున్నారు.
నిజానికి వీరు ఇష్టపడి మరీ వారిని పెళ్లి చేసుకున్నారు కానీ తర్వాత విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.అయితే వీరి విడిపోవడానికి ప్రధాన కారణం ఒకటే అని తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
నాగార్జునకి పెళ్లికాకముందు లక్ష్మి ఒక మంచి ఫ్రెండ్ గా ఉండేది.నాగార్జున, లక్ష్మి 1984లో వివాహం చేసుకున్నారు, నాగచైతన్యకు జన్మనిచ్చారు.ఆరేళ్లపాటు కలిసి ఉన్నారు.కానీ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
నాగార్జున మనసును అర్థం చేసుకోవడంలో లక్ష్మీ ఫెయిల్ అయిందని అంటారు.అలాగే ఆమె తన మాటే నెగ్గాలి అన్నట్లు ప్రవర్తించేదట.
అది నచ్చని నాగార్జున విడాకులు తీసుకున్నాడని ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త ప్రకారం తెలుస్తోంది.
ఇక కీర్తి రెడ్డి కూడా సుమంత్‌ను ఫారిన్ కంట్రీలో సెటిల్ అవుదామని ఫోర్స్ చేసిందట.అది నచ్చని సుమంత్ ఆమెతో పెళ్లి పెటాకులు చేసుకోక తప్ప లేదట.ఇక సమంత కూడా తనకి ఇష్టం వచ్చినట్లు ఉంటానని, సినిమాల్లో నటిస్తానని అక్కినేని ఫ్యామిలీతో గొడవలు పెట్టుకుందట.
తనని రిస్ట్రిక్ట్ చేసే హక్కు ఎవరికీ లేదని ఆమె ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేసేదట.అందుకే నాగచైతన్య కూడా ఆమె నుంచి విడాకులు తీసుకొని ఆమెకు ఫ్రీడమ్ ఇచ్చాడని ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త క్లెయిమ్ చేస్తోంది.
మొత్తంగా చూసుకుంటే ఈ విడాకులకు సారి తీసిన ప్రధాన కారణం ఈగో అని తెలుస్తోంది.ఏది ఏమైనా విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఎవరికి వారు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.ఈ వైరల్ అవుతున్న వార్తలో నిజం ఎంత అనేది అక్కినేని ఫ్యామిలీకే తెలియాలి.అక్కినేని ఫ్యామిలీలో మ్యారేజ్ కలిసి రాలేదనడానికి అఖిల్ పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోవడాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.