హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ కార్యాలయానికి నాయకులు తాకిడి పెరిగింది.బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పార్లమెంట్ టికెట్ ఆశావహులు కలుస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మాజీ ఎంపీ చాడా సురేశ్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, రాణీ రుద్రమదేవి, పన్నాల హరీశ్ రెడ్డి కోరుతున్నారు.అయితే బీజేపీలో మల్కాజ్ గిరి ఎంపీ సీటుకు ఫుల్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో మాజీ ఎంపీ చాడా సురేశ్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ మరియు పన్నాల హరీశ్ రెడ్డి సీటును ఆశిస్తున్నారు.
అలాగే భువనగిరిలో పోటీ చేసేందుకు రాణి రుద్రమతో పాటు బూర నర్సయ్య గౌడ్ సిద్ధం అవుతున్నారు.మరోవైపు మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తామని ఇప్పటికే ఈటల రాజేందర్ ప్రకటించారు.







