మంచు ధ్రువాల అన్వేషణలో ఇప్పటికే రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టిన భారత సంతతి , బ్రిటీష్ ఆర్మీ మెడిక్ హర్‌ప్రీత్ చాందీ మరో రికార్డు సృష్టించారు.31 రోజుల , 13 గంటల 19 నిమిషాలలో 1,130 కిలోమీటర్ల అంటార్కిటికాను కవర్ చేసి పోలార్ ప్రీత్( Polar Preet ) అని గుర్తింపు తెచ్చుకున్నారు .తద్వారా ఒంటరిగా, అత్యంత వేగంగా అంటార్కిటికాలో స్కీయింగ్ చేసిన మహిళగా అవతరించి ఆమె రికార్డుల్లోకెక్కింది.తాజా యాత్రపై హర్‌ప్రీత్ మాట్లాడుతూ.
ఇది పూర్తిగా భిన్నమైందన్నారు.గత యాత్రలతో పోలిస్తే పూర్తి విరుద్ధమైన పరిమితులు వుంటాయని చెప్పారు.
తాను మంచును బాగా ఎదుర్కోగలనని.అదే తాజా యాత్ర ప్రారంభించడానికి విశ్వాసాన్ని ఇచ్చిందని హర్‌ప్రీత్ తెలిపారు.

మరోవైపు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్( Guinness World Records ) ఈ క్లెయిమ్‌ను ధృవీకరించాలి.దీనికి నెలలు పట్టవచ్చు.గిన్నిస్ ఆమోదం లభిస్తే.కెనడియన్ కరోలిన్ కోట్ పేరిట ఉన్న గత రికార్డును హర్‌ప్రీత్ బద్ధలుకొడతారు.ఈ ట్రెక్ కోసం చాందీ .నవంబర్ 26న రోన్నే ఐస్ షెల్ప్‌లోని హెర్క్యులస్ ఇన్‌లెట్ నుంచి బయల్దేరి, డిసెంబర్ 28న యూకే కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.24 గంటలకు దక్షిణ ధ్రువానికి చేరుకున్నారు.ఆమె రోజుకు సగటున 12 నుంచి 13 గంటల పాటు స్కీయింగ్ చేశారు.దానితో పాటు సాహసయాత్రలో తనకు కావాల్సిన సామాగ్రితో కూడిన 75 కిలోల స్లెడ్‌ను లాగుతూ వెళ్లారు.

అంటార్కిటికాను అద్భుతమైన ప్రదేశంగా అభివర్ణించిన చాందీ.సాధారణ వ్యక్తులు ఈ ప్రదేశాన్ని జయించలేరని వ్యాఖ్యానించారు.గాయపడిన సైనికులు, అధికారులకు పునరావాసం అందించే ఫిజియోథెరపిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న చాందీ ప్రస్తుతం విరామంలో వున్నారు.అరికాళ్లు బొబ్బలెక్కించే ఎండ, మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఎలా ఎదుర్కోవాలో తెలుసునని చాందీ చెప్పారు.
ఉమెన్ ఇన్ డిఫెన్స్ అవార్డ్స్ 2022లో ‘‘ ఉమెన్ ఆఫ్ ది ఇయర్( Woman of the Year )’’గా ఎంపికైన చాందీ 2021లో దక్షిణ ధృవం వరకు 700 మైళ్ల అంటార్కిటిక్ ప్రయాణాన్ని ఒంటరిగా పూర్తి చేసిన తొలి శ్వేత జాతీయేతర మహిళగా చరిత్ర సృష్టించారు.దక్షిణ ధృవంపైన మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటాయి.
ఇలాంటి ప్రతికూల పరిస్ధితుల్లో తన కిట్‌ను లాక్కుంటూ 700 మైళ్లు వెళ్లారు చాందీ.







