జుట్టును సహజంగానే సిల్కీగా మార్చే చియా సీడ్స్.‌. ఎలా వాడాలంటే?

చియా సీడ్స్.( Chia Seeds ) వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

 How To Get Silky Hair With Chia Seeds!, Silky Hair, Hair Care, Hair Care Tips, C-TeluguStop.com

చూడటానికి చాలా చిన్న పరిమాణంలో కనిపించిన కూడా చియా సీడ్స్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ తో సహా అనేక పోషకాలు నిండి ఉంటాయి.ఆరోగ్యపరంగా ఈ గింజలు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.

అయితే జుట్టు సంరక్షణ( Hair Care )కు కూడా చియా సీడ్స్ ఉపయోగపడతాయి.ముఖ్యంగా కురులను సహజంగానే సిల్కీగా మార్చే సత్తువ చియా సీడ్స్ కి ఉంది.

మరి ఇంతకీ చియా సీడ్స్ ను జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Chia Seeds, Chiaseeds, Care, Care Tips, Healthy, Silky-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ వేసి ఒక కప్పు వాటర్ పోసి ఇర‌వై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్ ను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Chia Seeds, Chiaseeds, Care, Care Tips, Healthy, Silky-Telugu Health

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ హోమ్ రెమెడీని పాటిస్తే జుట్టు సహజంగానే సిల్కీగా, షైనీ గా మారుతుంది.కురులు తరచూ డ్రై అవ్వకుండా ఉంటాయి. సిల్కీ హెయిర్( Silky Hair ) ను కోరుకునే వారికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.పైగా ఈ చియా సీడ్స్ హెయిర్ మాస్క్( Chia Seeds Hair Mask ) ను వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.చుండ్రు సమస్య ఉన్న కూడా దూరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube