పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈ ఏడాది ఈయన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ గురించి గతంలో వేణు స్వామి( Venu Swamy ) ఎన్నో విషయాలను తెలియజేసిన సంగతి తెలిసిందే.ప్రభాస్ జాతకం గురించి చెబుతూ వేణు స్వామి పలు విషయాలను వెల్లడించారు.
ప్రభాస్ పెళ్లి ( Prabhas Marriage ) చేసుకుంటే మరో ఉదయ్ కిరణ్ అవుతారు అంటూ కూడా ఈయన కామెంట్ చేశారు.ప్రభాస్ జాతకం ప్రకారం ఆయనకు పెళ్లి యోగం లేదని తెలిపారు.

ఇక కెరియర్ పరంగా కూడా ప్రభాస్ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారని అలాగే ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని తెలియజేశారు.ఇకపోతే ఇటీవల కాలంలో ప్రభాస్ గురించి వేణు స్వామి (Venu Swamy) చేసినటువంటి వ్యాఖ్యలు తప్పని నిజమయ్యాయి ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటే ఇటీవల మోకాలు సర్జరీ చేయించుకున్నారు.అదే కాకుండా సలార్ సినిమా( Salaar ) ఫ్లాప్ అవుతుందంటూ కూడా వేణు స్వామి తెలిపారు దీంతో అభిమానులు ప్రస్తుతం ఈయనని ట్రోల్ చేస్తున్నారు.

ప్రభాస్ జాతకం విషయంలో ఈయన గురించి ట్రోల్స్ రావడంతో ఆయన ఆరోగ్యం గురించి మీకేం తెలుసు ఎదవల్లారా అంటూ వేణు స్వామి తన స్టైల్ లో సమాధానం ఇచ్చారు.ఇకపోతే తాజాగా వేణు స్వామికి గతంలో ప్రభాస్ పెళ్లి కాదు అని చెప్పారు.అయితే కొత్త సంవత్సరంలోనైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఇలా ఈయన పెళ్లి చేసుకుంటే కనుక వేణుస్వామి మాటలు తప్పు అని మరోసారి నిరూపించవచ్చు అంటూ అభిమానులు భావిస్తున్నారు.
అయితే ప్రభాస్ కూడా గత కొద్దిరోజుల క్రితం తప్పకుండా త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే.మరి ఈ ఏడాదిలోనైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటారా లేదా అతని తెలియాల్సి ఉంది.







