తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్నాయి.
ఇకపోతే తాజాగా రవితేజ ( Ravi Teja )స్నేహ ( Sneha )హీరో హీరోయిన్లుగా శీను వైట్ల దర్శకత్వంలో 20 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వెంకీ సినిమా( Venky Movie )తిరిగి విడుదల అయింది .ఈ సినిమా థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుందని చెప్పారు.ముఖ్యంగా బ్రహ్మానందం పాత్రకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నప్పుడు అభిమానులు భారీ స్థాయిలో అరుస్తూ పేపర్లు విసురుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

బ్రహ్మానందం ఎన్నో సినిమాలలో అద్భుతమైనటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో గజాల అనే పాత్రలో బ్రహ్మానందం ( Bramhanandam ) నటించారు.ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం రవితేజ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి అని చెప్పాలి.
ఇలా ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది ఈ సినిమా విడుదల అవుతున్నటువంటి తరుణంలో అభిమానులు ఏకంగా బ్రహ్మానందం భారీ కటౌట్స్ థియేటర్ ముందు ఏర్పాటు చేయడం విశేషం.

ఇక బ్రహ్మానందం ఎన్నో సినిమాలలో నటించినా వివిధ పాత్రల ద్వారా మీమర్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే దీంతో మీమర్స్ అందరూ కూడా థియేటర్ బయట పెద్ద ఎత్తున బ్రహ్మానందం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఇప్పటివరకు హీరోలకు లేదా హీరోయిన్లకు మాత్రమే ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మనం చూసాము కానీ కమెడియన్ అయినటువంటి బ్రహ్మానందం ఫ్లెక్సీలు కూడా ఈ స్థాయిలో ఏర్పాటు చేయడం అంటే బ్రహ్మానందం కి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు స్పష్టంగా అర్థం అవుతుంది.







