‘బిగ్ బ్రదర్‘ కాన్సెప్ట్ తో విదేశాల్లో మొదలైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో , మన ఇండియా లో ‘బిగ్ బాస్‘ పేరుతో ఆడియన్స్ కి పరిచయం అయ్యింది.తొలుత ఈ రియాలిటీ షో ని హిందీ లో ప్రారంభించారు, అక్కడ పెద్ద సక్సెస్ అయ్యింది.
ఆ తర్వాత మిగిలిన భాషల్లో ప్రారంభం అయ్యింది.ఇక మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ఆ తర్వాత రెండవ సీజన్ కి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు.ఈ సీజన్ కూడా పెద్ద హిట్ అయ్యింది.
ఇక ఆ తర్వాత మూడవ సీజన్ నుండి, 7 వ సీజన్ వరకు నాన్ స్టాప్ గా 5 టెలివిజన్ వెర్షన్ బిగ్ బాస్ సీజన్స్ కి, అలాగే ఒక ఓటీటీ వెర్షన్ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.

ఇక అతి త్వరలోనే ప్రారంభం అవ్వబొయ్యే బిగ్ బాస్ ఓటీటీ రెండవ వెర్షన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు.ఇలా ఇన్ని సీజన్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున కి ఎంత రెమ్యూనరేషన్ వచ్చి ఉంటుంది?, ఆయనకీ రెమ్యూనరేషన్ బేసిస్ లో ఇస్తారా?, లేకపోతే కమిషన్ బేసిస్ మీద డబ్బులు ఇస్తారా అనేది చాలా మందిలో మెదిలే ప్రశ్న.అయితే నాగార్జున రెమ్యూనరేషన్( Remuneration ) బేసిస్ మీదనే డబ్బులు తీసుకుంటాడట.
ఒక్కో సీజన్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అనేది సరిగా క్లారిటీ గా ఎవరికీ తెలియదు కానీ, అన్నీ సీజన్స్ కి కలిపి దాదాపుగా 120 కోట్ల రూపాయిల వరకు ఆయన సంపాదించాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.సినిమాల కంటే కూడా ఆయన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారానే ఇటీవల కాలం లో ఎక్కువ సంపాదించాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

అసలు బిగ్ బాస్ కాన్సెప్ట్ అనేదే నాకు ఇష్టం లేదు అని చెప్పుకొని తిరిగిన నాగార్జున( Nagarjuna ), అకస్మాత్తుగా ఎందుకు బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరించడానికి ఒప్పుకున్నాడు అంటే దానికి కారణం ఇది.రాబొయ్యే అన్నీ సీజన్స్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇకపోతే నాగార్జున ప్రస్తుతం ‘నా సామి రంగ’ ( Naa Saami Ranga )అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలిసిందే, సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది.