సంక్రాంతి కానుకగా రిలీజవుతున్న సినిమాలలో హనుమాన్ సినిమాపై( HanuMan Movie ) భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.బుక్ మై షో వెబ్ సైట్ లో సంక్రాంతికి విడుదలవుతున్న ఇతర తెలుగు సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉనాయి.
తేజ సజ్జా( Teja Sajja ) మూవీ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకోగా సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉండటం గమనార్హం.ఈ సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్ వేరే లెవెల్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది.
హనుమాన్ సినిమాతో తేజ సజ్జా ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.హనుమాన్ మూవీ పాన్ ఇండియా మూవీగా( Pan India Movie ) విడుదలవుతుండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది.
హనుమాన్ మూవీ ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు దక్కుతాయనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం.

సెన్సార్ రివ్యూ( Censor Review ) పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అమృతా అయ్యర్( Amritha Aiyer ) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.ఈ సినిమాలో చిరంజీవి( Chiranjeevi ) ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది.వైరల్ వార్తలు నిజమో కాదో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.

హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ( Director Prashanth Varma ) ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.హనుమాన్ మూవీ సక్సెస్ సాధిస్తే తేజ సజ్జా మార్కెట్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది.తేజ సజ్జాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
తేజ సజ్జా ఈ సినిమాకు పరిమితంగానే పారితోషికం అందుకున్నారని సమాచారం అందుతోంది.







