సూర్యాపేట జిల్లా: మునగాల మండల( Munagala mandal ) పరిధిలోని వివిధ గ్రామాల్లో దొంగతనాలు జరుగుతున్నాయని,ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని శనివారం మునగాల ఎస్ఐ లోకేష్( SI Lokesh ) మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది మహిళలు, పురుషులు గ్రామాలలో తిరుగుకుంటూ ఆయుర్వేద మందులు ఇస్తామని,పాత సామాన్లు ఏరుకోవటానికి అంటూ వచ్చి గ్రామాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు గ్రామాలలో సంచరించినట్లయితే వారిని ఫోటో తీసి మునగాల పోలీస్ స్టేషన్ సెల్ నెంబర్ 8712686048 ను సంప్రదించాలని తెలిపారు.