కళ్యాణ్ రామ్( Kalyan Ram ) సినిమా డెవిల్( Devil Movie ) గురించి ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి.ఎందుకంటే ఎవరైనా సినిమా చేయాలనుకుంటే దానికి కథ కథనం ఎలా సాగుతున్నాయి అనే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటారు.
బింబిసారా( Bimbisara ) వంటి ఒక అద్భుతమైన సినిమా తీసిన కళ్యాణ్ రామ్ నుంచి ఆ తర్వాత అంతకన్నా పవర్ ఫుల్ పాత్రలో ఒక సినిమా వస్తుంది అని నందమూరి అభిమానులంతా ఎదురుచూస్తున్న ఈ సందర్భంలో శుక్రవారం రోజు తాజాగా ఈ సినిమా విడుదల అయింది.ఈ సినిమా కన్నా ముందు కళ్యాణ్ రామ్ గురించి కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అతనొక్కడే( Athanokkade ) అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కళ్యాణ్ రామ్ నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు.అయితే సినిమా మొదలు పెట్టాలి అంటే ఒక నిర్మాత ఉండాలి.
స్టార్ కిడ్ అనే స్టేటస్ ఉన్నంత మాత్రాన ఎవరో ఒకరు కోట్ల రూపాయలు కుమ్మరించరు.ఇదే ఇండస్ట్రీలో జరిగే అసలు విషయం.
ఎందుకంటే సినిమా తీయాలి అంటే డబ్బులు కావాలి.పేరు అదే వస్తుంది.
అది ముందుగానే కళ్యాణ్ రామ్ గ్రహించాడు.అందుకే తను సినిమా తీసి, ఆ సినిమా విఫలమైతే తన ప్రొడ్యూసర్ రోడ్డున పడకూడదు అనుకున్నాడో ఏమో తానే నిర్మాతగా మారిపోయాడు.
అతనొక్కడే సినిమాకి తను హీరో మాత్రమే కాదు నిర్మాతగా( Producer ) కూడా వ్యవహరించాడు.తనకు ముందుగా ఒక గుర్తింపు కావాలి అనుకున్నాడు.ఎన్టీఆర్ మనవడిగా లేదంటే హరికృష్ణ కొడుకుగా ఉండాలి అని అనుకోలేదు.తన గురించి మంచి నటుడుగా లేదంటే అభిరుచి ఉన్న నిర్మాతగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి అని నిర్ణయించుకుని సురేందర్ రెడ్డి కథ చెప్పగానే ఎన్టీఆర్ ఆర్ట్స్( NTR Arts ) అనే ఒక బ్యానర్ పెట్టి ఆ చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్నాడు.
తను నమ్మిన సిద్ధాంతాన్ని నిజం అనే నిరూపించాడు.ఆ సినిమా ఆరోజు ఫ్లాప్ అయి ఉంటే ఈరోజు మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు.ఒక కొత్త దర్శకుడికి అవకాశాలు ఇవ్వాలి అనే సాహసం కూడా కళ్యాణ్ రామ్ చేస్తాడు.
ఇప్పటికి అలాంటి ప్రయోగాలు ఎన్నో చేశాడు.ఓం 3డి కూడా తను తన సొంత బ్యానర్ లో ప్రయోగాత్మక చిత్రంగా తీశాడు.హరే రామ్ సినిమా కూడా బాగుంటుంది.
కానీ ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా అంతే బాగున్న సినిమా వర్కౌట్ కాలేదు.కానీ అతనొక్కడే సినిమా విజయం సాధించిన తర్వాత దాదాపు 10 ఏళ్లకు పటాస్ సినిమా( Pataas Movie ) ద్వారా బ్లాక్ పాస్టర్ అందుకున్నాడు.
అమిగోస్, 118 సినిమాలు మంచి ప్రయత్నాలు కానీ ఫలితాలు బాగాలేవు.అయితే పటాస్ కి మళ్ళీ బింబిసారా కి మధ్య ఏడేళ్ల గ్యాప్ వచ్చింది అతడికి విజయం అందుకోవడానికి.
అయితే ఇప్పుడు మళ్ళీ ఆ విజయానికి బ్రేక్ పడి డెవిల్ సినిమా ద్వారా పరాజయాన్ని అందుకున్నాడు.