సాధారణంగా నందమూరి హీరోల సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉంటాయి.అయితే డెవిల్ సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేసినా బుకింగ్స్ మాత్రం ఆశించిన రేంజ్ లో లేవు.
డెవిల్ సినిమాను థియేటర్లలో చూడటానికి బాలయ్య ఫ్యాన్స్ ఇష్టపడలేదని అందువల్లే బుకింగ్స్ పై ప్రభావం పడిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ మధ్య కాలంలో బాబాయ్ బాలయ్యకు అబ్బాయిలు కళ్యాణ్ రామ్,( Kalyan Ram ) తారక్ లకు గ్యాప్ ఉందని ప్రచారం జరిగింది.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది.అయితే డెవిల్ సినిమాకు ( Devil movie )టాక్ పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమాకు సలార్ మినహా మరే సినిమా నుంచి పోటీ లేకపోవడం ఒకింత ప్లస్ అయిందని చెప్పవచ్చు.డెవిల్ సినిమాకు ట్విస్టులు హైలెట్ గా నిలిచాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

డెవిల్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది.తెలుగుతో పాటు హిందీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. డెవిల్ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
సంయుక్త మీనన్ నటిస్తే సినిమా హిట్ అని ఈ సినిమాతో మరోసారి నిజమైంది.ఆమె నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యనస్ కోరుకుంటున్నారు.
కళ్యాణ్ రామ్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.







