నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెవిల్ మూవీ( Devil movie ) నేడు థియేటర్లలో విడుదలైంది.తెలుగు రాష్ట్రాల్లో డెవిల్ షోలు ఒకింత ఆలస్యమవుతున్నా ఇతర ప్రాంతాల్లో మాత్రం డెవిల్ షోలు ఇప్పటికే పూర్తయ్యాయి.
డెవిల్ సినిమాకు నెటిజన్ల నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుండటం గమనార్హం.నందమూరి అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంది.
కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ఎంట్రీ సీన్, ట్విస్టులు, బీజిఎం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కు ఆ రేంజ్ హిట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మాస్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించేలా ఈ సినిమా సెకండాఫ్ ఉంది.ఈ సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి.
ఊహలకు అందని ట్విస్టులు ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు.

ఏజెంట్ రోల్ ( Agent role )లో కళ్యాణ్ రామ్ అదరగొట్టగా హీరోయిన్ పాత్రకు సంబంధించి వచ్చే షాకింగ్ ట్విస్ట్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నిదానంగా సాగే కథనం ఈ సినిమాకు ఒకింత మైనస్ అని చెప్పవచ్చు.పీరియాడిక్ సెటప్ ఈ సినిమాకు కలిసొచ్చింది.2023 సంవత్సరానికి డెవిల్ సినిమాతో కళ్యాణ్ రామ్ మంచి ముగింపును ఇచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సలార్ మూవీ విడుదలై వారం కావడంతో బాక్సాఫీస్ వద్ద డెవిల్ మూవీకి ఎలాంటి సమస్య లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.డెవిల్ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ 20 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో లేదో చూడాలి.ఈ సినిమాకు పోటీగా విడుదలైన బబుల్ గమ్ సినిమాకు సైతం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.2023 సంవత్సరంలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సొంతం చేసుకున్నాయి.







