నేటి నుండే ప్రజాపాలన కార్యక్రమం

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడం కోసం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్రామ/డివిజన్/వార్డు సభలు నిర్వహించబోతుంది.మొదటి సభ 28-12-2023 నుండి 06-01-2024 తేదీల మధ్య ఉంటుంది.

 Public Administration Program From Today , Public Administration Program, Welfar-TeluguStop.com

ప్రజలు కోరుకున్న విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేయబోతుంది.ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ/డివిజన్ సభలు నిర్వహించబోతున్నారు.

మీరు ఏ మీసేవ,ఆన్లైన్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదు.ప్రభుత్వం మీ ఇంటి ముందుకే రాబోతుంది.లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవాల్సిన పథకాలు.1.మహాలక్ష్మి పథకం (మహిళలకు నెలకు 2500 రూపాయలు)2.రైతు భరోసా పథకం(రైతులు, కౌలు రైతులు,రైతు కూలీల కోసం)3.

గృహజ్యోతి పథకం(కరెంట్ 200 యూనిట్ల లోపు జీరో బిల్) 4.ఇందిరమ్మ ఇండ్లు పథకం(ఇల్లు లేని వారి కోసం)5.

చేయూత పథకం (వృద్దులకు,వికలంగులకు 4000 ఫించన్) పైన తెలిపిన పథకాల కోసం దరఖాస్తు తీసుకోవడానికి అధికారులు 28-12-2023 నుండి 06-01-2024 వరకు ఈ తేదీల లోపు మన డివిజన్ కే వస్తారు.అధికారులు ఎప్పుడు వస్తారనేది ఒకరోజు ముందు గానే పబ్లిసిటీ మాద్యమాల ద్వారా మనకు తెలియజేస్తారు.

వారే అప్లికేషన్ ఫారం ఇచ్చి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తారు.దరఖాస్తు నింపి దానితో పాటు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు జీరాక్స్ జత చేస్తే సరిపోతుంది.

డివిజన్ సభ ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.దరఖాస్తుల సంఖ్యను బట్టి ప్రతి డివిజన్ లో రెండు రోజులు సభ నిర్వహించే అవకాశం ఉంది.

ముఖ్య గమనిక అన్ని పథకాలకు ఒక్కటే అప్లికేషన్ ఫారం ఉంటుంది.మరొక విషయం రేషన్ కార్డు లేని లబ్దిదారులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు.ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ డివిజన్ సభలు నిర్వహిస్తారు.రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు.

ఆ రేషన్ కార్డు వచ్చిన తరువాత మరల డివిజన్ సభలో మీరు ఈ పథకాల కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి నిర్దిష్ట కాల పరిమితి అంటూ ఏమీ లేదు.

ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీ డివిజన్ సభల్లో పైన తెలిపిన పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube