వచ్చే లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) కు కొత్త అధ్యక్షుడిని నియమించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.కొత్త ఏడాదిలో మొదట్లోనే ఈ నియామకం చేపట్టాలనే ఆలోచనలో ఉంది.
ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తెలంగాణ ముఖ్యమంత్రి గానూ బాధ్యతలు నిర్వహిస్తున్న నేసథ్యంలో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు మరొకరికి అప్పగించాలని నిర్ణయించుకుంది.ఈ మేరకు కొత్త అధ్యక్షుడి నియామకానికి కసరత్తు మొదలుపెట్టింది.
అయితే ఈ పదవికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టికి అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన పేరును పరిశీలిస్తోంది.
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి, ఎస్సి సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు( Mallu Bhatti Vikramarka ) ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడంతో పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో పెరుగుతోంది.

ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులుగా ఉన్న నలుగురు పేర్లను పరిశీలిస్తోంది.పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ డిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు( V Hanumantha Rao ) పేర్లను కాంగ్రెస్ హాయ్ కమాండ్ పరిశీలనకు తీసుకుందట.ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ ఈ విషయంపై చర్చించారట.
జనవరి రెండో వారం నాటికి తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట.రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, వి హనుమంతరావు లలో ఒకరికి మద్దతు ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది.

కొత్త అధ్యక్షుడు నియామకం తర్వాత పూర్తిగా లోక్ సభ ఎన్నికలపైనే దృష్టి సారించారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాదిరిగానే ఎంపీ స్థానాలను గెలుచుకునే విధంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు.అయితే పిసిసి అధ్యక్ష పదవి కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారట.కర్ణాటకలో డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, పిసిసి అధ్యక్ష పదవిని ఇచ్చినట్టుగానే తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట.








