తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) బాలీవుడ్ సినిమా అయినా అనిమల్ తో( Animal ) తనదైన సత్తా చాటుతున్నాడు ఈ సినిమా ఇప్పటికే 900 కోట్ల వరకు కలక్షన్లు రాబట్టి తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమా సూపర్ అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేశారు.అయితే ఈ సినిమా 900 కోట్ల కలక్షన్లను రాబట్టింది అయితే ఈ సినిమా నిర్మాణం లో సందీప్ రెడ్డి వంగ ఇన్వాల్వ్ అయిన విషయం మనకు తెలిసిందే…

వీళ్ళ అన్నయ్య అయిన ప్రణయ్ రెడ్డి( Pranay Reddy Vanga ) అలాగే భూషణ్ కుమార్ ఇద్దరు ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.ఇక దాంతో సందీప్ రెడ్డి వంగ 200 కోట్ల భాగస్వామ్యాన్ని పొందబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కి సాధ్యం కానీ రేంజ్ లో సందీప్ రెడ్డి వంగ 200 కోట్లు రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు ప్రభాస్( Prabhas ) హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమాకి( Spirit Movie ) కూడా సందీప్ రెడ్డి వంగ వాళ్ళ అన్నయ్య ఆయన ప్రణయ్ రెడ్డి అలాగే టి సిరీస్ వాళ్లు ఇద్దరు కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయితే సందీప్ రెడ్డి వంగ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకునే అవకాశం కూడా ఉంది.ఇంక ఇప్పటికే రాజమౌళి( Rajamouli ) త్రిబుల్ ఆర్( RRR ) సినిమా కోసం 150 కోట్లు తీసుకున్నాడు అంటూ వార్తలైతే వచ్చాయి.ఇక రాజమౌళి రికార్డును బ్రేక్ చేస్తూ సందీప్ వంగ ఇప్పుడు 200 కోట్ల రూపాయలని ఒక సినిమా మీద దక్కించుకోవడం అనేది పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది…








