మన దేశంలోని గొప్ప మల్ల యోధురాలలో ఒకరైన సాక్షి మాలిక్( Sakshi Malik ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.హర్యానాకు( Haryana ) చెందిన సాక్షి మాలిక్ 2016 సంవత్సరంలో జరిగిన రియో ఒలింపిక్( Rio Olympics ) పోటీలలో రెజ్లింగ్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.1992లో జన్మించిన సాక్షి మల్ల యోధుడైన తాతయ్య సుబీర్ మాలిక్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు.12 సంవత్సరాల వయస్సులోనే సాక్షి మాలిక్ రెజ్లింగ్ లో చేరారు.
కోచ్ ఈశ్వర్ సహకారంతో సాక్షి శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు.సాక్షి మాలిక్ 2009లో ఆసియా జూనియర్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో 59 కిలోల ఫ్రీ స్టైల్ లో రజత పతకాన్ని( Silver Medal ) సాధించారు.
ఇది ఆమె మొదటి సక్సెస్ గా తన గెలుపు ఖాతాలో వేసుకున్నారు.ఆ తర్వాత సాక్షి జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొని అందులో కూడా సత్తా చాటారు.
ఈ ప్రయత్నంలో సాక్షి కాంస్యం సొంతం చేసుకున్నారు.

2014 సంవత్సరంలో డేవ్ షుల్జ్ అంతర్జాతీయ టోర్నమెంట్ లో స్వర్ణం( Gold Medal ) గెలిచిన సాక్షి ఆ తర్వాత కామన్వెల్త్ లో రజతం గెలిచారు.వరుసగా ఎన్ని పతకాలు సాధించినా ఒలింపిక్స్ ను లక్ష్యంగా పెట్టుకున్న సాక్షి రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకంతో తను ఏ స్థాయి రెజ్లరో చెప్పేశారు.డబ్ల్యూ.
ఎఫ్.ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్( Brij Bhushan Sharan Singh ) విధేయుడు అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ఆమె రిటైర్మెంట్ ప్రకటించారు.

తన రిటైర్మెంట్ గురించి సాక్షి మాలిక్ స్పందిస్తూ మహిళా రెజ్లర్ల విషయంలో బ్రిజ్ భూషణ్ ప్రవర్తించిన తీరుపై గళమెత్తామని కదం తొక్కామని అన్నారు.కేసు నమోదు చేయించామని డబ్ల్యు.ఎఫ్.ఐ( W.F.I ) తాజా ఎన్నికలలో చివరకు ఆయన వర్గమే గెలిచిందని సాక్షి పేర్కొన్నారు.మహిళా అధ్యక్షురాలు ఉంటే బాగుంటుందని మేము భావించామని సాక్షి మాలిక్ అన్నారు.సాక్షి మాలిక్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







