యూఎస్ అధ్యక్ష ఎన్నికలు : రిపబ్లికన్ ప్రైమరీలలో డొనాల్డ్ ట్రంప్‌ను నిక్కీ హేలీ ఓడించగలరా..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఆ దేశంలో తారాస్థాయిలో జరుగుతోంది.ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అభ్యర్ధులు కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

 Can Indian-origin Nikki Haley Beat Donald Trump In The Republican Primaries Deta-TeluguStop.com

రిపబ్లికన్ పార్టీ ( Republican Party ) తరపున పోటీ చేస్తున్న భారత మూలాలున్న నిక్కీ హేలీ( Nikki Haley ) ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.తొలుత సరైన ప్రచారం దక్కని హేలీ రోజులు గడిచే కొద్దీ దూసుకెళ్తున్నారు.

రిపబ్లికన్‌ అభ్యర్ధుల్లో అందరికంటే ముందంజలో వున్న మాజీ అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌కు హేలీ గట్టి పోటీ ఇస్తున్నారు.హేలీకి 29 శాతం మంది మద్ధతు వుంటే.

ట్రంప్‌కు 33 శాతం మంది అనుకూలంగా వున్నట్లు తేలింది.అంటే ఇద్దరి మధ్యా కేవలం 4 శాతం మార్జిన్ మాత్రమే.

హేలీ సెప్టెంబర్ నుంచి తన ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు.మరో పోల్‌లో ఆమెకు ప్రస్తుతం లభిస్తున్న మద్ధతులో సగం వున్నట్లు తేలింది.

సాంప్రదాయ ఓటర్లలో ట్రంప్‌కు( Donald Trump ) బలమైన ప్రత్యర్ధిగా నిక్కీ హేలీ నిలబడుతున్నారు.

జూలై నుంచి జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఏకైక అభ్యర్ధి హేలీ మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి.

అయినప్పటికీ ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కంటే దిగువన వున్నారు నిక్కీ హేలీ.అయోవా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో నిక్కీ హేలీకి ప్రజాదరణ పెరిగింది.ఈ నేపథ్యంలో రిపబ్లికన్ ప్రైమరీలలో ట్రంప్‌ను ఆమె ఓడించగలరా అనే వాదనలు వినిపిస్తున్నాయి.అయోవా వ్యూహకర్త డేవిడ్ కోచెల్( David Kochel ) ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ.

నిక్కీ హేలీ చెప్పుకోదగిన ప్రదర్శన ఇచ్చిందని ప్రశంసించారు.దూకుడు మీదున్న డొనాల్డ్ ట్రంప్‌కు హేలీ ప్రత్యర్ధిగా ఆవిర్భవించారని కోచెల్ వెల్లడించారు.

ఇది కాకుండా తన మద్ధతుదారులతో కలిసి సంకీర్ణాన్ని నిర్మించడానికి నిక్కీ హేలీ ప్రయత్నిస్తున్నారని ఏబీసీ న్యూస్ నివేదిక పేర్కొంది.

Telugu Chris Sununu, David Kochel, Donald Trump, Nikki Haley, Republican, Ron De

అనూహ్యంగా నిక్కీహేలీకి మద్ధతు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.రిపబ్లికన్ నేత, నాలుగు సార్లు గవర్నర్‌గా పనిచేసిన క్రిస్ సునును.( Chris Sununu ) హేలీకి మద్ధతు ప్రకటించారు.

అలాగే అత్యంత ప్రభావవంతమైన అమెరికన్ సాంప్రదాయవాద సంస్థలలో ఒకటైన ‘‘ ప్రొస్పెరిటీ ’’ కూడా ఆమెకు తన ఆమోదం తెలిపింది.అమెరికన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌ కీత్ రాబోయిస్ వంటి కీలకమైన దాతల మద్ధతును ఆమె పొందగలిగారు.

ఆయన గతంలో రాన్ డిసాంటిస్‌కు( Ron DeSantis ) గట్టి మద్ధతుదారుగా వున్నారు.పాపులారిటీ పెరుగుతున్నప్పటికీ.జాతీయ ఎన్నికల్లో ట్రంప్ కంటే హేలీ వెనుకబడే వుంది.న్యూయార్క్ టైమ్స్ సియానా కాలేజ్ పోల్ ప్రకారం 63 శాతం మంది ప్రైమరీ ఓటర్లు ట్రంప్‌ను ఇష్టపడుతుండగా, హేలీకి 12 శాతం, డిసాంటిస్‌ 9 శాతంతో మూడో స్థానంలో నిలిచారు.

Telugu Chris Sununu, David Kochel, Donald Trump, Nikki Haley, Republican, Ron De

ఇప్పుడున్న పరిస్ధితుల్లో ట్రంప్‌కు గట్టి సవాల్ విసరాలంటే ఆమె తన మద్ధతును మరింత పెంచుకోవాలి.రాయిటర్స్ నివేదిక ప్రకారం హేలీకి గ్రామీణులు, మధ్య తరగతి, శ్రామిక వర్గం, కళాశాల డిగ్రీలు లేని ఓటర్ల మద్ధతు అవసరం.డిసాంటిస్ వంటి బలమైన రిపబ్లికన్ అభ్యర్ధులు రేసు నుంచి తప్పుకుంటే నిక్కీ హేలీ అవకాశాలు మరింత మెరుగుపడతాయి.ఈ పరిణామం పార్టీలోని ట్రంప్ వ్యతిరేక వర్గాలను కలపడానికి ఆమెకు వీలు కలిగిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube