Bandla Ganesh : అందరిలా లక్ష పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పను… బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో ఆఫీస్ బాయ్ గా పని చేసి అనంతరం సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నటువంటి వారిలో నటుడు బండ్ల గణేష్ ( Bandla Ganesh ) ఒకరు.ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో కమెడియన్ గా నటించారు.

 Actor Bandla Ganesh Comments Viral On Social Media-TeluguStop.com

అనంతరం ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ నేడు అగ్ర నిర్మాతగా ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేశారు.అయితే ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినటువంటి బండ్ల గణేష్ త్వరలోనే మరికొన్ని సినిమాల ద్వారా తాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను అంటూ వెల్లడించారు.

ఇలా ఈయన సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు.ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బండ్ల గణేష్ తన పూర్తి మద్దతును తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇండస్ట్రీలో బండ్ల గణేష్ కు పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) అంటే ఎంతో వీరాభిమానం.కళ్యాణ్ ను ఏకంగా తన దేవుడితో సమానంగా భావిస్తూ పవనేశ్వర అంటూ సంబోధిస్తూ ఉంటారు.

అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తో కాస్త డిస్టర్బెన్స్ వచ్చిందని అందుకే పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా ప్రస్తావించారంటూ కూడా వార్తలు వస్తుంటాయి.

ఇలా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడిన లేదా పవన్ తో తనకు విభేదాలు వచ్చాయి అని వార్తలు వచ్చిన తాను పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు దూరమయ్యే పరిస్థితిలో ఉండవంటూ ఈయన వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.తాను ప్రతిరోజు ఒక గంటన్నర పాటు వివిధ రకాల పుస్తకాలు( Books ) చదువుతానని బండ్ల గణేష్ తెలిపారు.

ఇలా చదువుతున్నప్పుడు ఏదైనా మంచి వ్యాఖ్యలు కనపడితే దానిని నేను స్కెచ్ పెన్ తో అండర్ లైన్ చేసుకుంటానని బండ్ల గణేష్ తెలిపారు.

ఇలా ప్రతిరోజు గంటన్నర పాటు పుస్తకాలు చదవడం నాకు అలవాటుగా ఉంది.నేను అంత సేపు మాత్రమే చదువుతాను అందరిలాగా లక్షల్లో పుస్తకాలు చదివాను అంటూ నేను గొప్పలు చెప్పుకోను అంటూ బండ్ల గణేష్ ఈ సందర్భంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇలా ఈ వ్యాఖ్యలు చేయడంతో చాలామంది బండ్లన్న మీరు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే మాట్లాడారు కదా అంటూ కామెంట్లో చేస్తున్నారు.అయితే ఈ వీడియోలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన రాలేదు కానీ ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటూ పలువురు భావిస్తున్నారు.మరి కొంతమంది అభిమానుల మాత్రం బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడలేదని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) గారిని ఉద్దేశించి మాట్లాడారు అంటూ ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

ఈయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలియదు కానీ ఈ విషయం కాస్త చర్చలకు కారణం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube