టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేస్తూ కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ అందుకున్నారు.ఈయన కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు.
అయితే పుష్ప సినిమా( Pushpa Movie ) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇలా నటుడిగా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని బిజీగా ఉన్నారు.
ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ( Sneha Reddy ) అనే అమ్మాయిని ప్రేమించే పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇక ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి మనకు తెలిసిందే.
స్నేహ రెడ్డి హీరోయిన్ కాకపోయినా ఈమెకు హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే.
తరచూ హీరోయిన్ మాదిరిగా పెద్ద ఎత్తున ఫోటోషూట్లను జరుపుతూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తన భర్త పిల్లలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వడంతో ఈమెను సోషల్ మీడియాలో అనుసరించే వారి సంఖ్య కూడా భారీగానే ఉందని చెప్పాలి.ఇలా హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు.
ఈ ఫోటో తాను స్కూల్ చదువుతున్న సమయంలో తీసుకున్న ఫోటో అని స్పష్టంగా అర్థమవుతుంది.ఇందులో భాగంగా ఈమె స్కూల్ యూనిఫాంలో ఉన్నారు.ఇలా తన పక్కనే మరో అబ్బాయి కూడా స్కూల్ యూనిఫామ్ లో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.అయితే వీరిద్దరూ స్కూల్ చదువుతున్న సమయంలో ఎక్కడైతే ఆ ఫోటో దిగారో ఇప్పుడు అదే వ్యక్తితో అదే చోట ఈమె దిగినటువంటి ఫోటోని కూడా కలేజ్ చేస్తూ షేర్ చేశారు.
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా ఈమె యూనిఫాంలో ఉన్నటువంటి ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.
స్కూల్ చదువుతున్న రోజులలో కూడా స్నేహ రెడ్డి ఎంతో అందంగా ఉన్నారు అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.అయితే అప్పటికి ఇప్పటికీ ఈమె అందంలో ఏమాత్రం మార్పు లేదని మరి కొంతమంది అభిమానులు ఈ ఫోటోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈమె స్టార్ హీరో భార్య అయినప్పటికీ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.కేవలం అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో పాటు పిల్లల ఫోటోలను ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.