ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది.రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీతో మరో పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసే బరిలో దిగనున్నాయి.అయితే వీరిలో సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై ఇంతవరకు ఎటువంటి అధికార ప్రకటన రాలేదు.
ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత చెబుతారని అందరూ భావిస్తుండగా టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యాలతో జనసేన క్యాడర్ తో పాటు ఏపీ ప్రజలకు పలు అనుమానాలు వస్తున్నాయని తెలుస్తోంది.
ఇటీవలే టీడీపీ – జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబేనంటూ తేల్చి చెప్పిన లోకేశ్ మరోసారి తన మనసులో బయటపెట్టారని తెలుస్తోంది.
టీడీపీ ప్రభుత్వం గనుక ఏర్పడితే పొత్తుల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవి అయినా జనసేనాని పవన్ కల్యాణ్ కు ఇస్తారా అన్న ప్రశ్నకు లోకేశ్ చెప్పిన సమాధానంతో జనసేన క్యాడర్ కు అయోమయస్థితికి చేరుకున్నారట.డిప్యూటీ సీఎం పదవిని ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు, పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని లోకేశ్ స్పష్టం చేయడంతో తమ పరిస్థితి ఏంటంటూ బావురుమంటున్నారని తెలుస్తోంది.
లోకేశ్ ఇన్ని వ్యాఖ్యలు చేసినా పవన్ కల్యాణ్ స్పందించకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట.దాదాపు పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన జనసైనికులు, మద్ధతు ఇచ్చిన కాపు నాయకులు ఏం చేయాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారట.
ఈ క్రమంలోనే లోకేశ్ వ్యాఖ్యలపై ఇప్పటివరకు పవన్ కల్యాణ్ ను సమర్థిస్తున్న కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య లేఖాస్త్రాన్ని సంధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న సామాజిక పరిణామాలు చూస్తుంటే కాపు సామాజికవర్గ ఉనికికే ముప్పు తెచ్చే విధంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇన్నాళ్లు వేరు ఇప్పటినుంచి వేరనే భావన జనసైనికుల మదిలో మెదలాడుతోంది.ఈ క్రమంలోనే మరోసారి చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమని కాపులు అంటున్నారని తెలుస్తోంది.
కాపులకు అండగా నిలబడతానని మద్ధతు ఇచ్చిన పవన్ ఇప్పుడు చంద్రబాబుకు మద్ధతు ఇస్తూ తమ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాడని మండిపడుతున్నారని సమాచారం.కాపులకు మంచి చేస్తాడని భావించిన తమను మోసం చేశాడా అనే ఆలోచనకు వచ్చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో తాజా పరిస్థితులను బట్టి చూస్తుంటే పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారంటూ వస్తున్న వార్తలు నిజమనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
లోకేశ్ వ్యాఖ్యలపై జనసేనాని పవన్ కానీ, నాదెండ్ల కానీ ఇంతవరకు స్పందించలేదు.
దీన్ని బట్టి చూస్తే ఆఖరుకు జనసేనను టీడీపీలో విలీనం చేయడం కూడా ఖాయమనే అర్థం అవుతుందని కాపు నేతలతో పాటు ఏపీ వాసులు అనుకుంటున్నారట.మొదటి నుంచి పార్టీ కోసం నిలబడి ఇన్నేళ్లు పోరాటం చేసిన తమను తమ అధినేత పవన్ కల్యాణే మోసం చేస్తున్నాడని మండిపడుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయిని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జన సైనికులు తమ గొంతును వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.తమ కష్టానికి తగ్గట్లుగా సీట్లు కేటాయించేలా చర్యలకు సిద్ధపడాలని భావిస్తున్నారట.
దీన్ని బట్టి చూస్తే హరిరామ జోగయ్య రాసిన లేఖలోని అంశాలు వాస్తవం అని జనసేన క్యాడర్ నమ్ముతుందని అర్థం అవుతోంది.దీంతో ఈ వ్యవహారం జనసేన పార్టీలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.







