యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ”సలార్”( Salaar ).ఈ సినిమాకు రిలీజ్ అయ్యిన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ మరో హిట్ అనేది అందుకోలేదు.
దీంతో హిట్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూసారు.
ఇక ఎట్టకేలకు సలార్ తో అయితే డార్లింగ్ హిట్ తన ఖాతాలో వేసుకోవడంతో మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్టే అని చెప్పాలి.దీంతో బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ప్రభంజనం మాములుగా లేదు.
రెండు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి రికార్డులను తుడిచిపెట్టేస్తున్నాడు.
ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటించగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మించారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించారు.
కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయక పోయినప్పటికీ ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు.తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాలపై కామెంట్స్ చేసాడు.
కల్కితో పాటు సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న స్పిరిట్ సినిమాలపై కామెంట్స్ చేసారు.రాజమౌళి, ప్రశాంత్ నీల్ లతో పని చేయడం ఫెంటాస్టిక్ గా అనిపించిందని.నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తాయని వాటి కోసం కూడా నేను ఎదురు చూస్తున్నానని తెలిపాడు.దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.