తెలంగాణ అస్తిత్వాన్ని సృష్టించిన పార్టీ బీఆర్ఎస్..: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.తెలంగాణ ఏర్పడక ముందు పాత అప్పులు రూ.72,658 కోట్లని తెలిపారు.

 Brs Is The Party That Created The Existence Of Telangana: Ktr-TeluguStop.com

తెలంగాణ అప్పులు రూ.3.17 లక్షల కోట్లని కేటీఆర్ పేర్కొన్నారు.రూ.6.71 లక్షల కోట్ల అప్పు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందన్నారు.సివిల్ సప్లైలో రూ.56 వేల కోట్ల అప్పు ఉందని చెప్పారన్న కేటీఆర్ అందులో రూ.30 వేల కోట్ల విలువైన ధాన్యం నిల్వలు ఉన్నాయని తెలిపారు.అలాగే ఎఫ్సీఐ నుంచి రూ.16 వేల కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు.ఆర్బీఐ నివేదికలనే తాము ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు.2014 లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.14 లక్షలన్న కేటీఆర్ 2023లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.17 లక్షలని వెల్లడించారు.తెలంగాణ అస్తిత్వాన్ని సృష్టించిన పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అప్పుల చేశామని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube