2023 ఏడాదిలో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టాప్ స్టార్ క్రికెటర్లు వీళ్లే..!

ఈ 2023 ఏడాదిలో ఎంతోమంది క్రికెటర్లు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.అయితే రిటైర్మెంట్ ప్రకటించిన ఆ జాబితాలో ఉన్న టాప్ స్టార్ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

 Cricketers Who Retired From International Cricket In Year 2023 Details, Crickete-TeluguStop.com

హాషీమ్ ఆమ్లా:

దక్షిణాఫ్రికాకు చెందిన ఈ బ్యాటర్ 2023 జనవరిలో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.రెండు దశాబ్దాల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో దక్షిణాఫ్రికా( South Africa ) తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 18672 పరుగులు చేశాడు.

ఆరోన్ ఫించ్:

ఆస్ట్రేలియా జట్టును టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలబెట్టిన తొలి కెప్టెన్.ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ గా జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.2023 ఫిబ్రవరిలో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Telugu Aaron Finch, Alex Hales, Ambati Rayudu, Cricketers, Hashim Amla, Joginder

మొయిన్ అలీ:

ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండర్ మొయిన్ అలీ( Moeen Ali ) ఇప్పటివరకు క్రికెట్లో 6603 పరుగులు చేశాడు.అలాగే, 360 వికెట్లు తీశాడు.ఈ 2023లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Telugu Aaron Finch, Alex Hales, Ambati Rayudu, Cricketers, Hashim Amla, Joginder

అంబటి రాయుడు:

భారత జట్టు స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు( Ambati Rayudu ) ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై జట్టు టైటిల్ గెలిచిన తర్వాత క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

Telugu Aaron Finch, Alex Hales, Ambati Rayudu, Cricketers, Hashim Amla, Joginder

స్టూవర్ట్ బ్రాడ్:

ఇంగ్లాండ్ జట్టు( England ) స్టార్ బౌలర్.అంతర్జాతీయ క్రికెట్లో 847 వికెట్లు తీశాడు.ఈ యాషెస్ 2023 టెస్టు సిరీస్ తర్వాత క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

Telugu Aaron Finch, Alex Hales, Ambati Rayudu, Cricketers, Hashim Amla, Joginder

అలెక్స్ హేల్స్:

ఇంగ్లాండ్ కు చెందిన అలెక్స్ హేల్స్( Alex Hales ) 2022 లో టీ20 ప్రపంచ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.ఇంగ్లాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచులు ఆడిన హేల్స్ 2023 ఆగస్టు 4న క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Telugu Aaron Finch, Alex Hales, Ambati Rayudu, Cricketers, Hashim Amla, Joginder

డ్వైన్ ప్రిటోరియస్:

దక్షిణాఫ్రికా జట్టు ఆల్ రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ 2023లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.అయితే ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు.

Telugu Aaron Finch, Alex Hales, Ambati Rayudu, Cricketers, Hashim Amla, Joginder

మురళీ విజయ్:

భారత జట్టులోకి 2008లో టెస్టుల్లో ఆరంగట్రం చేశాడు.భారత్ తరపున తొమ్మిది టీ20 మ్యాచ్లు, 17 వన్డే మ్యాచ్లు, 61 టెస్ట్ మ్యాచ్లు ఆడి, 2023లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Telugu Aaron Finch, Alex Hales, Ambati Rayudu, Cricketers, Hashim Amla, Joginder

జోగిందర్ శర్మ:

భారత జట్టు స్టార్ బౌలర్.2007లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ 2023లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube