హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ మేరకు రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు 935 గ్రాముల నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో పెద్ద పెద్ద మిషన్లతో డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.డ్రగ్స్ తయారీ నిర్వాహకులు సతీశ్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలుస్తోంది.
కాగా నిందితుడు సతీశ్ రెడ్డిపై గతంలోనూ పలు కేసులు నమోదు అయ్యాయని అధికారులు వెల్లడించారు.







