మనం ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుంటే ఏదో ఒకరోజు ఏదో ఒక విధంగా సక్సెస్ ను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది.ఒకవైపు గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా ఇంటి పనులు చూసుకుంటూ ప్రశంసలు అందుకున్న ప్రమీలాదేవి ఎస్సై ఫలితాల్లో 16వ ర్యాంక్ సాధించారు.
ఓపెన్ కేటగిరీలో ఆమె ఈ ర్యాంక్ సాధించగా నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఇద్దరు పిల్లల బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ సక్సెస్ సాధించిన ప్రమీలాదేవి( Prameela devi ) టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

గతంలో ప్రమీలాదేవికి గ్రామ, వార్డ్ సచివాలయ పోలీస్ ఉద్యోగం వచ్చినా వేర్వేరు కారణాల వల్ల ఆమె విధుల్లో చేరలేదు. మహిళా విభాగంలో ప్రమీలా దేవి 5వ ర్యాంక్ సాధించారు.మొత్తం 411 ఉద్యోగాల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఎన్నో ఆవాంతరాలను ఎదుర్కొని ఆమె సక్సెస్ అయ్యారు.ఎస్సై ఉద్యోగాలు ( SI Jobs )సాధించిన వ్యక్తుల కుటుంబాలలో సంబరాలు అంబరాన్నంటాయి.

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే మామూలు విషయం కాదు.ఒక ఉద్యోగం కోసం వెయ్యి మంది పోటీ పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.ప్రమీలాదేవి సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.ప్రమీలాదేవే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం గమనార్హం.ప్రమీలాదేవి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ కెరీర్ పరంగా సత్తా చాటుతూ అంతకంతకూ ఎదుగుతున్నారు.ప్రమీలాదేవి తన టాలెంట్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
బుచ్చయ్యపేట మండలం వడ్డాదికి చెందిన ప్రమీలాదేవి సక్సెస్ సాధించడంలో భర్త సత్తిబాబు పాత్ర ఎంతో ఉంది.ప్రమీలాదేవి భవిష్యత్తులో కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







