బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్... త్వరలోనే ఓటీటీకి రంగం సిద్దం!

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్(BiggBoss) కార్యక్రమం ఒకటి ఈ కార్యక్రమం ఇప్పటివరకు అన్ని భాషలలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది

 Biggboss Telugu Nonstop Season 2 Coming Soon, Bigg Boss, Ott, Nagarjuna, Telugu-TeluguStop.com

ఇక తెలుగులో 7 సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.డిసెంబర్ 17వ తేదీ సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి అయింది గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కాస్త మంచి రేటింగ్ సొంతం చేసుకుందనే విషయం తెలిసిందే.

ఈ సీజన్లో భాగంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) టైటిల్ గెలుపొందారు.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ కావడంతో త్వరలోనే సీజన్ ఎయిట్ ప్రారంభించడానికి వీలు కుదరదు.

ఈ కార్యక్రమం ప్రారంభం కావాలి అంటే మరొక ఏడాది పాటు సమయం పడుతుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం నిర్వాహకులు నాన్ స్టాప్ పేరుతో మరొక ఓటీటీ సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.

Telugu Bigg Boss, Nagarjuna, Telugu-Movie

ఇదివరకే బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ కార్యక్రమం ప్రసారమైన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా అప్పటివరకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొంతమంది కంటెస్టెంట్ లో సందడి చేశారు.అలాగే మరికొందరు కొత్త వారిని ఎంపిక చేశారు.ఈ సీజన్లో బిందు మాధవి (Bindhu Madhavi) టైటిల్ గెలిచారు.మొట్టమొదటిసారి ఒక లేడీ కంటెస్టెంట్ ఇలా కప్పు గెలవడం జరిగింది.అయితే త్వరలోనే ఓటీటీలోనే సీజన్ 2 ప్రారంభించబోతున్నారని, ఈ కార్యక్రమానికి నాగార్జున (Nagarjuna)హోస్ట్గా వ్యవహరిస్తున్నారని సమాచారం.

ఇప్పటికే కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుందని తెలుస్తోంది.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube