బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు స్వల్ప ఊరట లభించింది.ఈ మేరకు పల్లవి ప్రశాంత్ కు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పల్లవి ప్రశాంత్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం ప్రతి ఆదివారం పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ క్రమంలోనే కేసులో ఉన్న ఏ1 నుంచి ఏ4 వరకు కోర్టు బెయిల్ ఇచ్చింది.అలాగే పల్లవి ప్రశాంత్ మీడియాతో మాట్లాడొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారన్న సంగతి తెలిసిందే.