సినిమాలపై మోజుతో ఆ విషయాన్ని పక్కన పెట్టిన శ్రీ లీల... ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి శ్రీ లీల ( Sree Leela) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా ప్రతినెలా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

 Sreeleela Not Attended To Mbbs Exams For Gunturu Kaaram Shooting , Mahesh Babu,-TeluguStop.com

ఇక కొత్త సంవత్సరంలో కూడా మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం( Gunturu Kaaram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో శరవేగంగా సినిమా చిత్రీకరణ పనులను పూర్తి చేసుకుంటున్నారు.

Telugu Gunturu Kaaram, Mahesh Babu, Mbbs, Sreeleela, Tollywood-Movie

ప్రస్తుతం ఈ సినిమాలోని ఒక పాట చిత్రీకరణ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే శ్రీ లీల ఈ సినిమా షూటింగ్ కోసం తన కెరీయర్ని కూడా పక్కన పెట్టారని తెలుస్తోంది.ఈమె వృత్తిపరంగా వైద్య విద్యను చదువుతున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్( Mbbs ) పరీక్షలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో శ్రీ లీల కొంతకాలం పాటు షూటింగులకు బ్రేక్ ఇచ్చి పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు.

అయితే ఉన్నఫలంగా గుంటూరు కారం సినిమాలోని ఒక పాట చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలోనే ఈమె తన పరీక్షలను సైతం గాలికి వదిలేసి సినిమా షూటింగ్లో పాల్గొన్నారనీ తెలుస్తోంది.

Telugu Gunturu Kaaram, Mahesh Babu, Mbbs, Sreeleela, Tollywood-Movie

ఎంబిబిఎస్ పరీక్షలను కూడా పక్కనపెట్టి సినిమా షూటింగ్లకు రావడంతో ఈమెకు సినిమాలపై ఉన్నటువంటి ఆసక్తి తెలుస్తోంది కానీ మరోవైపు తన చదువును నెగ్లెక్ట్ చేశారు అంటూ కూడా పలువురు కామెంట్లు చేస్తున్నారు.అయితే తన పరీక్షలను సప్లిమెంటరీలో రాసుకోవచ్చు అన్న నేపథ్యంలోనే ఈమె పరీక్షలను రాయకుండా గుంటూరు కారం సినిమా షూటింగ్లలో బిజీగా మారిపోయారని తెలుస్తోంది.ఇటీవల నాలుగు సినిమాలు విడుదల కాగా ఈమె నటించడం భగవంత్ కేసరి( Bhagavanth kesari ) మాత్రమే మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈమె ఆశలన్నీ కూడా గుంటూరు కారం పైనే ఉన్నాయని తెలుస్తుంది.మరి మహేష్ బాబు సినిమాతో శ్రీ లీల హిట్ అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube