అమెరికన్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా( NASA ) అంతరిక్షంలో కనిపించే అనేక అద్భుతమైన విషయాలను ఫోటో తీసి మన అందరితో పంచుకుంటుంది.తాజాగా నాసా క్రిస్మస్ ట్రీలా( Christmas Tree ) కనిపించే యువ నక్షత్రాల సమూహానికి సంబంధించిన అద్భుతమైన ఇమేజ్ పంచుకుంది.
ఈ ఫొటోను చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ( Chandra X-Ray Observatory ) తీసింది.ఈ అబ్జర్వేటరీ హై-ఎనర్జీ ఎక్స్-రేస్‌లో విశ్వాన్ని పరిశీలించే ఒక టెలిస్కోప్.
NGC 2264 అని పేరు పెట్టిన ఈ నక్షత్ర సమూహం, భూమికి దాదాపు 2,500 కాంతి సంవత్సరాల దూరంలో మన గెలాక్సీ, పాలపుంతలో ఉంది.సూర్యుని వయస్సు 4.6 బిలియన్ సంవత్సరాలతో పోలిస్తే నక్షత్రాలు( Stars ) చాలా చిన్నవి, వీటి వయసు ఒకటి నుంచి ఐదు మిలియన్ సంవత్సరాల వరకు ఉంటాయి.నక్షత్రాలు వేర్వేరు పరిమాణాలు, ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి, సూర్యునిలో పదో వంతు చిన్న నుంచి ఏడు రెట్లు పెద్దవి.

నాసా షేర్ చేసిన ఫోటోలు బ్లూ, వైట్ రంగులలో మెరుస్తున్న నక్షత్రాలను మనం చూడవచ్చు, అయితే చుట్టూ ఉన్న వాయువు, ధూళి మేఘాలు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగును విడుదల చేస్తున్నాయి.వాయువు, ధూళి మేఘాల లేదా నెబ్యులా( Nebula ) ఆకారం స్పైకీ కొమ్మలతో త్రిభుజాకార క్రిస్మస్ చెట్టును పోలి ఉంటుంది.నక్షత్రాలు చెట్టుపై మెరిసే ఆభరణాల వలె కనిపిస్తాయి.ఈ ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో గెలాక్సీలు, క్వాసార్‌ల వంటి ఇతర విశ్వ వస్తువులను కూడా బయటపడుతోంది.

క్రిస్మస్ ట్రీ రూపాన్ని పెంచేందుకు ఈ చిత్రాన్ని ప్రాసెస్ చేసినట్లు నాసా వివరించింది.ఈ ఫోటోను రివర్స్ చేసినట్లు, నక్షత్రాలు, నెబ్యులా మధ్య వ్యత్యాసాన్ని హైలైట్ చేయడానికి రంగులు ఎంపిక చేసినట్లు తెలిపింది.చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీలోని రెండు వేర్వేరు పరికరాల నుంచి డేటాను కలపడం ద్వారా ఈ చిత్రం క్రియేట్ అయింది.ఆ 2 వేర్వేరు పరికరాలు ఏంటంటే అడ్వాన్స్‌డ్ CCD ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ (ACIS), హై రిజల్యూషన్ కెమెరా (HRC).
ఈ చిత్రం 5 లక్షలకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కొంతమంది యూజర్లు ఫొటో అందం, అద్భుతాన్ని ప్రశంసించారు.
దీనిని మీరు కూడా చూసేయండి,







