ప్రస్తుత కాలంలో మంచి పేరు తెచ్చుకోవడానికి నెలల సమయం పడితే ఒక తప్పు చేసినా చెడ్డ పేరు మాత్రం వస్తుంది.పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
బిగ్ బాస్ సీజన్7 విజేత( Bigg Boss Season 7 ) ఊహించని వివాదాలలో చిక్కుకోవడం అభిమానులకు సైతం షాకిచ్చిందనే చెప్పాలి.అయితే అమాయకత్వమే పల్లవి ప్రశాంత్ కు శాపంగా మారిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
పోలీసులు చెప్పినా వినకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ( Pallavi Prashant rally ) నిర్వహించడంతో సుమోటోగా తీసుకుని ప్రశాంత్ పై కేసు ఫైల్ చేశారు.కొంతమంది పల్లవి ప్రశాంత్ అభిమానులం అంటూ ఇతర కంటెస్టెంట్ల కార్లపై దాడులు చేయగా పల్లవి ప్రశాంత్ కనీసం ఖండించలేదు.
ఈ తరహా ఘటనలు జరగకుండా ఫ్యాన్స్ కు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయలేదు.పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాననే సంతోషంలో పోలీసుల మాట వినకుండా చేసిన తప్పులే అతనిని బ్బందులకు గురి చేశాయి.

పల్లవి ప్రశాంత్ పై నమోదైన కేసులు ప్రూవ్ అయితే అతనికి శిక్ష కూడా భారీగానే పడే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.పల్లవి ప్రశాంత్ చేసిన తప్పులకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆధారాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ఈ వివాదాల వల్ల పల్లవి ప్రశాంత్ కెరీర్ నాశనమైందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.పల్లవి ప్రశాంత్ కొన్ని విషయాల్లో మారాల్సిన అవసరం లేదు.

బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) ను కొంతమంది కచ్చితంగా స్పూర్తిగా తీసుకుంటారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.పల్లవి ప్రశాంత్ భవిష్యత్తులో వివాదాలకు, విమర్శలకు తావివ్వకుండా మెలిగితే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.పల్లవి ప్రశాంత్ ను అభిమానించే వాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో విమర్శించే వాళ్లు సైతం అదే స్థాయిలో ఉన్నారు.







