టీడీపీ నేత నారా లోకేశ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యువగళం పాదయాత్ర ముగింపు సభ ప్రారంభమైంది.ఈ మేరకు యువగళం -నవశకం పేరిట జరుగుతున్న భారీ బహిరంగ సభకు టీడీపీ నేతలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
యువగళం – నవశకం భారీ బహిరంగ సభ దేశ రాజకీయాల్లో కీలక ఘట్టం కానుందని ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.లోకేశ్ పాదయాత్రను ప్రజలు విజయవంతం చేశారని పేర్కొన్నారు.
అలాగే మరో వంద రోజుల్లో టీడీపీ – జనసేన ప్రభుత్వాన్ని చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోబోతున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.







