తెలంగాణ శాసనసభ అరగంట పాటు వాయిదా పడింది.అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు.
ఆర్థిక పరిస్థితిపై చర్చించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.దీనిపై బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్ రావు స్పందిస్తూ శ్వేతపత్రం ఇచ్చిన వెంటనే చర్చించమంటే ఎలా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే సుమారు 42 పేజీలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితపై శ్వేతపత్రం ఇచ్చారన్న హరీశ్ రావు నోట్ చదవకుండానే మాట్లాడమనడం సరికాదని పేర్కొన్నారు.మరోవైపు నోట్ బుక్ చదివేందుకు గానూ కనీసం గంట సమయం ఇవ్వాలని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ సభను కోరారు.
అయితే గతంలో కూడా లఘుచర్చ సమయంలోనే నోట్ ఇచ్చేవారని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు.నిర్మాణాత్మక చర్చకు ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని ఆయన తెలిపారు.
ఈ క్రమంలోనే అరగంట విరామం తరువాత చర్చను కొనసాగిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.