భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu )కు ఫోన్ చేయడం జరిగింది.ఇజ్రాయెల్ లో శాంతి నెలకొల్పటానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
కష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని.
భారత్ వ్యతిరేకిస్తుందని ఫోన్ లో తెలియజేయడం జరిగింది.ఇజ్రాయెల్ కష్ట సమయాల్లో భారత్ అండగా ఉంటుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.
గత మూడు నెలల నుండి ఇజ్రాయెల్…హమాస్ మధ్య బీకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.అక్టోబర్ 7వ తారీకు ఇజ్రాయెల్ దక్షిణ భూభాగంలోకి హమాస్ ఉగ్రవాదులు అక్రమంగా చొరబడి సామాన్య పౌరులను సైనికులను అతికిరాతకంగా చంపేశారు.
కొంతమందిని బందీలుగా కూడా తీసుకెళ్లి పోవడం జరిగింది.దీంతో అప్పటినుండి మొదలైన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్… అప్పటినుండి ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తుంది.దీంతో ఇప్పుడు గాజా పట్టణం శిథిలాలుగా మారిపోతోంది.
ఎక్కువగా గాజా పట్టణంలో హాస్పిటల్స్ మరియు స్కూల్స్ ఆధారం చేసుకుని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై రాకెట్లు వదిలే వాళ్ళు.ఆడవాళ్లను.
చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని ఇజ్రాయెల్ నీ దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేయడం జరిగింది.దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్.
బలగాలు గాజా( Gaza ) పట్టణంలో బీకరమైన యుద్ధం చేస్తూ ఉన్నాయి. హమాస్.
ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చాలామంది సామాన్యులు బలైపోతున్నారు.పరిస్థితి ఇలా ఉండగా వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడంతో ఒకపక్క ఇస్లామిక్ దేశాలు మరోపక్క పాశ్చాత్య దేశాలు రంగంలోకి దిగి యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నాయి.