రాజకీయాలలోకి పల్లవి ప్రశాంత్... ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు తెలుసా?

బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలోకి కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చి చివరకు ట్రోఫీ అందుకున్నటువంటి పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రైతు బిడ్డగా ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ గా(Bigg Boss 7 Winner) బయటకు వచ్చారు.

 Pallavi Prashanth Interesting Comments On Politics Details, Pallavi Prashanth,bi-TeluguStop.com

దీంతో ఈయనకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కార్యక్రమంలో గెలుపొందిన తర్వాత ఈయనకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు కూడా వస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదని తెలుస్తోంది.

ఇప్పటికే పలువుర హీరోల సినిమాలలో పల్లవి ప్రశాంత్ ను తీసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.ఇకపోతే ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో గెలుపొందిన తర్వాత పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే.ఇక ఈయన కోసం ఒక వేదిక ఏర్పాటు చేయగా పల్లవి ప్రశాంత్ వేదికపై అభిమానులను ఉద్దేశించి ఎన్నో విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ కు కొన్ని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి.

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన రాజకీయాలలోకి(Politics) వస్తే కనుక ఎంతో బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం ఏదైనా ఉందా వస్తే ఒకవేళ ఏ పార్టీకి మీరు మద్దతు తెలియజేస్తారు అనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురయింది.ఈ ప్రశ్నకు పల్లవి ప్రశాంత్ సమాధానం చెబుతూ ఒకసారిగా నవ్వారు నేను రాజకీయాలలోకి రానని నాకు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశమే లేదని చెప్పారు.నేను ఎప్పుడూ కూడా ఒక రైతు బిడ్డగానే ఉంటాను అంటూ ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube